ఫిర్యాదును వాపస్ తీసుకోకపోతే చంపేస్తామని బెదిరింపులు….

119

PV NEWS/ NELLORE;- నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం ఏకొల్లు గ్రామపంచాయతీ ఎలక్షన్స్ నామినేషన్ లో అభ్యర్థి ఆవుల బ్లెస్సీ ఇచ్చిన తప్పుడు సమాచారంపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు తాము ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని అభ్యర్థి యాగాని సుమతి భర్త యాగాని మునిశేఖర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రత్యర్థి బ్లెస్సి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ముగ్గురు సంతానాన్ని కలిగి, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని ఆరోపించారు. ప్రత్యర్థులకు స్థానిక నేతల మద్దతు ఉండడంతో అధికారులు సైతం తమ ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారిని ప్రోత్సహించకుండా తమకు న్యాయం చేయాలని, గ్రామ అభివృద్ధి జరిగేలా చూడాలని కోరుతున్నామన్నారు.