ఇక్కడ మందులతో పాటు మద్యం దొరుకుతుంది…

158

PV NEWS/ NELLORE;- ఇటీవల కాలంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకాలపై సెబ్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నిప్పో సెంటర్ లోని మెడికల్ షాపు కేంద్రంగా అమ్ముతున్న లక్షా 75 వేల రూపాయల విలువ చేసే తెలంగాణ మద్యం బాటిళ్లు, స్కూటీని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకుని మురళి అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమకు వచ్చిన పక్కా సమాచారంతో నిఘా పెట్టి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన డీఎస్పీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావు, సీఐ అశోక్ కుమార్, ఎస్సై రవీంద్ర, కానిస్టేబుళ్లు అజీజ్ బాష, కృష్ణయ్య, ప్రసాద్ తదితర సిబ్బందిని అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.