అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు..

66

PV NEWS/ NELLORE;- నెల్లూరు ముత్తుకూరు రోడ్డు లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మీ ,అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి ఆదేశాలతో ఎస్ఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తమకు అందిన పక్కా సమాచారంతో ముత్తుకూరు రోడ్డు లో పాత కారులో తరలిస్తున్న కర్ణాటకకు చెందిన ఎనభై ఐదు లీటర్ల సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కార్ ను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తి చిన్న చెరుకూరు కు చెందిన కడియం సురేష్ గా గుర్తించామని డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. మద్యం పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావు, సీఐ అశోక్ కుమార్, ఎస్సై రవీంద్ర, కానిస్టేబుళ్లు అజీజ్ బాష, కృష్ణయ్య, ప్రసాద్ తదితర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.