అక్రమ కేసులు ఎన్ని పెట్టినా టిడిపి బలోపేతాన్ని ఎవరూ ఆపలేరు… టిడిపి నేతలు

25

PV NEWS/ NELLORE;- తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీకి పతనం తప్పదని టిడిపి నేతలు ధ్వజ మెత్తారు. నెల్లూరు పార్లమెంటరీ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్, నగర ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సమక్షంలో ఎన్టీఆర్ నగర్ కు చెందిన నాగేంద్ర ఆధ్వర్యంలో వంద కుటుంబాలు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్, శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ వైసిపి దౌర్జన్యాల నుంచి తమ కార్యకర్తలకు రక్షణ కల్పిస్తామన్నారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని గత ఎన్నికల్లో చేసిన పొరపాటును సరిదిద్దుకుని టీడీపీని గెలిపిస్తారని ఆకాంక్షించారు. తమ పై నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.