ఉగాది మహోత్సవ ఆహ్వాన బ్రోచర్ ను ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే

35

PV NEWS/ NELLORE;- మూలపేట ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం ఉగాది మహోత్సవ ఆహ్వాన బ్రోచర్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూరల్ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన ఉగాది పురస్కరించుకుని సింహపురి గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం లో ఉగాది మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణాసంచా, విద్యుత్ దీపాల అలంకరణతో అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉగాది ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని సూచించారు.