జనహిత వాత్సల్య ఆశ్రమంలో మాస్క్ లను పంపిణీ చేసిన హెల్త్ ఎడ్యుకేటర్ చేజర్ల సుధాకర్ రావు

33

PV NEWS/ NELLORE;- కరోన సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా నెల్లూరు వనం తోపు సెంటర్ లోని జనహిత వాత్సల్య చిన్నారుల, వృద్ధుల ఆశ్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్ రావు మాస్క్ లను పంపిణీ చేశారు. ఆశ్రమ పరిధిలోని జాతీయ విద్యా వికాస్ విద్యార్థులకు కరోనా పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కరోన నిబంధనలు పాటించాలని, లక్షణాలు కనిపించిన వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకౌంట్స్ మేనేజర్ ప్రకాశరావు, హెడ్మాస్టర్ మధుసూదన్ రెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు మల్లికార్జున, గిరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.