పార్టీ బలోపేతానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- రూరల్ ఎమ్మెల్యే

46

PV NEWS/ NELLORE;- పార్టీ బలోపేతానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని టైలర్స్ కాలనీ నుంచి టిడిపి నేతలు వందలాది మంది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తన నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రూరల్ పరిధిలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.