5 నిమిషాల్లో క్యాన్సర్ ను నిర్ధారించే అత్యాధునిక పెట్- సిటీ ని ప్రారంభించిన మెడికవర్ వైద్యులు…

86

PV NEWS/ NELLORE;- 5 నిమిషాలలో కాన్సర్ నిర్ధారణ చేసే సామర్థ్యం ఉన్న అత్యాధునిక ప్రపంచస్థాయి పెట్-సిటి ని మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ జాన్ స్టాబ్బింగ్టన్ నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అత్యాధునిక క్యాన్సర్ సేవలను విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. తమ వైద్యుల నైపుణ్యానికి అత్యాధునిక పరిజ్ఞానం తోడవ్వడంతో రోగులకు మెరుగైన చికిత్స అందించగలుగుతున్నామని తెలిపారు. మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ కాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ , చెన్నై వంటి మహానగరాలకు వెళ్లనవసరంలేకుండా నెల్లూరులోనే అత్యాధునిక క్యాన్సర్ సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. పెట్-సిటి లో స్కాన్ చేసినప్పుడు కాన్సర్ కణాలు స్పష్టంగా కనపడతాయని, కాన్సర్ చికిత్సతో పాటు గుండె సమస్యలకు, ఇన్ఫెక్షన్ వ్యాధుల నిర్ధారణకు , ఇన్ఫ్లేమేటరీ వ్యాధులను నిర్ధారించడంలో పెట్ సిటీ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో నెల్లూరు కాన్సర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ సుమన్, తదితర వైద్యులు పాల్గొన్నారు.