కోవిడ్ నిబంధనలను పాటిస్తాం.. రంజాన్ ప్రార్థనలకు అనుమతివ్వండి…

42

PV NEWS/ NELLORE;- ఏడాదికి ఒకసారి వచ్చే రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని లాక్డౌన్ విధించవచ్చని ముస్లిం సోదరులు ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు మూలపేటలోని ధార్మిక సంస్థ జమియత్ ఉలమా వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ముఖ్య సభ్యులు మౌలానా అబు తాలిబ్ రహ్మని మాట్లాడారు. గత ఏడాది కరోనా విజృంభణతో లాక్ డౌన్ కారణంగా రంజాన్ ప్రార్థనలకు అవకాశం లేకుండా పోయిందని ఏడాదికి ఒకసారి వచ్చే రంజాన్ మాసపు ప్రత్యేక ప్రార్థనలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మౌలానా ఇలియాస్, స్థానిక అధ్యక్షులు మౌలానా షేక్ అహ్మద్, మౌలానా ముష్టాఖ్ మదని, మౌలానా సుహేబ్, హాజీ అహమ్మద్ బాష, తదితర ధార్మిక పండితులు పాల్గొన్నారు.