గంజాయి అక్రమ రవాణా లో పట్టుబడ్డ మహిళలు… 50 కేజీల గంజాయి స్వాధీనం…

303

PV NEWS/ NELLORE;- తిరుపతి పార్లమెంటు, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా జరుగుతున్న తనిఖీల్లో భారీగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో విశాఖపట్నం నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సెబ్ అధికారులు గుర్తించారు. వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో చేపట్టిన వాహన తనిఖీల్లో ఐదుగురు నిందితుల వద్ద నుంచి 35 లక్షల రూపాయల విలువచేసే 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో తుని, మర్రిపాడు కు చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.